బొబ్బిలి మార్కెట్ నాలుగు రోడ్ల జంక్షన్‌లో పాడైపోయిన కల్వర్టును బాగు చేసిన తర్వాత, దాని నుంచి తీసిన మట్టిని రోడ్డు మధ్యలోనే వారం రోజులుగా తొలగించకపోవడంతో ప్రజలు, వ్యాపారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మట్టిని వెంటనే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.