ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, బొబ్బిలిలోని బ్రహ్మ కుమారీస్ ఆశ్రమంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. బొబ్బిలి సెంటర్ ఇన్‌చార్జి బీకే రాజేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఆశ్రమం పరిసరాల్లో వివిధ రకాల మొక్కలు నాటారు. ప్రకృతి సమతుల్యత దెబ్బతినడం, కాలుష్యం పెరగడం వల్ల వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయని, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని వివరించారు. రాజయోగ ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత పెంపొందించి ప్రకృతి సంరక్షణకు తోడ్పడవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాలుగు గ్రామాల నుంచి వచ్చిన రాజయోగ
విద్యార్థులు పాల్గొన్నారు.