రైతులకు సీఎం సందేశం: పంచ సూత్రాలపై అవగాహన

5చూసినవారు
రైతులకు సీఎం సందేశం: పంచ సూత్రాలపై అవగాహన
బొబ్బిలి మండలం పారాది గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారి మధ్య శ్యాంసుందర్ ఆధ్వర్యంలో 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో భాగంగా, గౌరవనీయులైన ముఖ్యమంత్రి సందేశాన్ని, కార్యక్రమాన్ని రైతులతో వీక్షించారు. ముఖ్యమంత్రి సూచించిన పంచ సూత్రాలైన నీటి భద్రత, పంటల మార్పిడి, రసాయన ఎరువుల వాడకం తగ్గించడం, ప్రకృతి సేద్యంపై మొగ్గుచూపడం, ఫుడ్ ప్రాసెసింగ్ అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా పారాది గ్రామంలో అధికంగా పండే మొక్కజొన్న పంటపై సమగ్ర యాజమాన్య పద్ధతులు, ఎరువుల వాడకం, కత్తెర పురుగు నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతు సోదరులు, గ్రామ వ్యవసాయ సహాయకులు నూకమ నాయుడు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్