
బంగాళఖాతంలో బలహీపనడిన దిత్వా తుఫాన్
బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ బలహీనపడి, తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ తీవ్ర వాయుగుండం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తోంది. డిసెంబర్ 1వ తేదీ ఉదయానికి ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.




