జిల్లాలో పగటిపూట దొంగతనాలు చేస్తున్న ముగ్గురు నిందితులను, ఒకరిని రిసీవర్‌ను అరెస్టు చేసి, సుమారు 26 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఎ. ఆర్. దామోదర్ తెలిపారు. డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న పువ్వల మణికంఠ పది చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. అతని వద్ద నుంచి 20 తులాల బంగారం, ఎస్. కోటలో జరిగిన చోరీ కేసులో 4 తులాల బంగారం, జామి పరిధిలో బస్సు ప్రయాణికురాలి వద్ద చోరీ అయిన 2 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసులను ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.