మంగళవారం తెల్లవారుజామున బొబ్బిలి పట్టణం, పరిసర ప్రాంతాలు దట్టమైన పొగమంచుతో కప్పబడి, సూర్యుడు కనిపించనంతగా వాతావరణం చల్లబడింది. రహదారులపై దృశ్యమానత తగ్గడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయ క్షేత్రాలు తెల్లని మంచుతో కప్పబడి ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కూరగాయలు, పూలు, పప్పుధాన్య పంటలకు తెగుళ్లు వ్యాప్తి చెందే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.