సాలూరు-విశాఖ మెము రైలు కోసం జూన్ 3న ధర్నా

0చూసినవారు
సాలూరు-విశాఖ మెము రైలు కోసం జూన్ 3న ధర్నా
సాలూరు-బొబ్బిలి మీదుగా విశాఖపట్నం వరకు రైలు వెంటనే నడపాలని, బొబ్బిలి రైల్వే వ్యాగన్ లోడింగ్, అన్‌లోడింగ్ పాయింట్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జూన్ 3 ఉదయం 8 గంటలకు బొబ్బిలి రైల్వే స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ మేరకు కరపత్రాలు విడుదల చేశారు. రైలు రద్దుతో పది గ్రామాల ప్రజలు విద్య, వైద్యం, రవాణాలో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పి. శంకర్రావు, మెరుగని గోపాలం, ఎం. శ్రీనివాస్, కె. అప్పన్న, మువ్వల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్