విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని ఏపీఎస్ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్‌లో హెవీ వెహికల్ డ్రైవింగ్ ట్రైనింగ్ పూర్తి చేసిన 24వ బ్యాచ్ అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడి వెంకటేశ్వరరావు అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నైపుణ్యంతో సేవలు అందించి మెరుగైన డ్రైవర్‌లుగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి, డిపో మేనేజర్ జే. శ్రీనివాసరావు, ట్రైనర్ రాజు తదితరులు పాల్గొన్నారు.