అగ్నిప్రమాదంలో గాయపడి వృద్ధురాలి మృతి

6చూసినవారు
అగ్నిప్రమాదంలో గాయపడి వృద్ధురాలి మృతి
బాడంగి మండలంలో అగ్నిప్రమాదం సంభవించి, చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతిచెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం, బాడంగి పెద్ద వీధికి చెందిన మరడాన పాపమ్మ (76) శనివారం సాయంత్రం కట్టెల పొయ్యిపై వంట చేస్తుండగా, ప్రమాదవశాత్తు ఆమె చీరకు నిప్పు అంటుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు ఆదివారం విజయనగరం మహారాజా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మృతురాలికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్