ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో బొబ్బిలి మండలం అలజంగిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలకు వ్యతిరేకంగా జీవో ప్రతులను దహనం చేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి గోపాల్ మాట్లాడుతూ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు విరుద్ధంగా కేంద్రం రైతులకు నష్టం చేసే విధంగా మద్దతు ధరలు ప్రకటించిందని ఆరోపించారు. పెట్టుబడులు పెరిగినా వరికి కేవలం రూ. 72 మాత్రమే పెంచడం అన్యాయమని, ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలు తగ్గించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీను, త్రినాధ్, జి. లక్ష్మి తదితర రైతులు పాల్గొన్నారు.