బొబ్బిలి పట్టణం తాండ్రపాపరాయ జంక్షన్‌లోని ప్రశాంతి స్వీట్స్ షాపులో ఉదయం సుమారు 9 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే ఎమ్మెల్యే ఆర్. వి. ఎస్. కె. కె. రంగారావు (బేబీ నాయన) సంఘటనా స్థలానికి చేరుకుని నష్టాన్ని పరిశీలించారు. బాధితులను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.