కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ జె. సి. రాజు మాట్లాడుతూ, భాషా ఆధారిత రాష్ట్రాల ఏర్పాటు అమరజీవి పొట్టి శ్రీరాముల ప్రాణ త్యాగం ద్వారానే సాధ్యమైందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీరాముల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే తపనతో 58 రోజులు నిరాహార దీక్ష చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని, ఆయన త్యాగం నేటి పాలకులకు, యువతకు ఆదర్శం అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.