
మే 10న మోదీ తెలంగాణ పర్యటన: ఎంపీ ఈటల
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీన తెలంగాణ పర్యటనకు రానున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా రూ.7,000 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు, రైల్వే, జాతీయ రహదారులు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చడంలో విఫలమైందని, ఈ సభను 'జన ఆగ్రహ సభ'గా పిలుస్తున్నారని ఈటల పేర్కొన్నారు.




