వృద్ధురాలి మెడలో బంగారు చైన్ అపహరణ

2చూసినవారు
వృద్ధురాలి మెడలో బంగారు చైన్ అపహరణ
మంగళవారం బొబ్బిలి రైల్వే సెంటర్ వద్ద పాన్ షాపు యజమాని కోడి సాయిబాబు ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 85 ఏళ్ల కోడి బంగారం మెడలో ఉన్న రెండు తులాల బంగారు చైన్‌ను, కోడలు పంపిందని చెప్పి వచ్చిన సుమారు 35-40 ఏళ్ల మహిళ అపహరించుకు వెళ్లింది. కేకలు విని పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఆర్. రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఒక మహిళను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్