విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాది గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) ఘనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి వసతి గృహాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో
జనసేన పార్టీ ఇంచార్జ్ గిరడ అప్పలస్వామి,
టీడీపీ సీనియర్ నాయకులు అల్లాడ భాస్కరరావు, ఆర్డీవో రామ్మోహన్ రావు, ఎంపీడీవో రవికుమార్, ఇతర ప్రభుత్వ అధికారులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.