బొబ్బిలి సిహెచ్‌సీ అప్‌గ్రేడ్‌పై ప్రభుత్వ స్పందన

5చూసినవారు
బొబ్బిలి సిహెచ్‌సీ అప్‌గ్రేడ్‌పై ప్రభుత్వ స్పందన
బొబ్బిలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలన్న ఎమ్మెల్యే ఆర్. వీ. ఎస్. కే. కే. రంగారావు (బేబీనాయన) అడిగిన ప్రశ్నకు కూటమి ప్రభుత్వం స్పందించింది. ఆరోగ్య శాఖ నుంచి వచ్చిన లేఖలో ఈ అంశాన్ని దశలవారీగా పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలిపింది. పిహెచ్‌సీలు, సెకండరీ హెల్త్ సంస్థల అప్‌గ్రేడ్ కోసం ఏకరీతి విధానం రూపుదిద్దుకుంటోందని, అది ఖరారైన వెంటనే బొబ్బిలి సిహెచ్‌సీపై చర్యలు ప్రారంభిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్