బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి దాడితల్లి గ్రామదేవత పండుగ సందర్భంగా మంగళవారం ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గొల్లపల్లి ఆలయం, బైపాస్ రోడ్డులోని ఆలయాల వద్ద తెల్లవారుజాము నుంచే పూజల కోసం భక్తులు బారులు తీరారు. ఎమ్మెల్యే బేబీనాయన అమ్మవారిని దర్శించుకుని భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. పట్టణం, గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించడంతో ఉత్సవ వాతావరణం నెలకొంది.