విజయనగరం జిల్లా తెర్లాం మండలం కుసుమూరు ప్రాథమికోన్నత పాఠశాలలో స్వచ్ఛతే సేవా కార్యక్రమంపై కళాజాత బృందం విద్యార్థులకు అవగాహన కల్పించింది. స్వచ్ఛమైన జీవనశైలే ఆరోగ్యానికి పునాది అని, వ్యక్తిగతంగా, పరిసరాల్లో పరిశుభ్రత పాటించాల్సిన అవసరాన్ని పాటలు, ప్రదర్శనల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆరోగ్య స్పృహను పెంచే లక్ష్యంతో నిర్వహించబడింది.