దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం నింపాలి: కారుణ్య ఫౌండేషన్

బొబ్బిలిలోని కారుణ్య కార్యాలయంలో బుధవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కారుణ్య సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ జె.సి.రాజు అన్నారు. ఈ సందర్భంగా 16 మంది దివ్యాంగులను దుశ్శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందించారు. దివ్యాంగుల పట్ల జాలి చూపడం కంటే వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలని కారుణ్య ఉపాధ్యక్షులు నాగురు రమేష్ పేర్కొన్నారు. దివ్యాంగుల ప్రతినిధి రాంబాబు కారుణ్య సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చిన్నారావు, సోమేశ్, కృష్ణ మోహన, రమేష్, చందు, రమేష్, దివ్యాంగులు పాల్గొన్నారు.
