ప్రపంచ దివ్యంగుల దినోత్సవం సందర్భంగా కారుణ్య ఫౌండేషన్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చైర్మన్ జె. సి. రాజు మాట్లాడుతూ, దివ్యాంగులలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం సమాజం బాధ్యత అని అన్నారు. ఈ సందర్భంగా 16 మంది దివ్యాంగులను దుశాలువాలు కప్పి సత్కరించారు. ఉపాధ్యక్షుడు నాగూరు రమేష్ దివ్యాంగులకు జాలి కాక ప్రోత్సాహం అవసరమని తెలిపారు. కార్యక్రమంలో సి. హెచ్. రాంబాబు, తాడి హరిబాబు సహా పలువురు పాల్గొన్నారు.