బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు అంటాకుల వీధిలో వీధి దీపాలు పనిచేయకపోవడంతో స్థానికులు ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో వీధులు పూర్తిగా చీకటిగా మారుతున్నాయని, దీనివల్ల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, భద్రతపై కూడా ఆందోళన నెలకొంటోందని తెలిపారు. అధికారులు స్పందించి వీధి దీపాలను వెంటనే మరమ్మతు చేసి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.