తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాలు బొబ్బిలి నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 10 క్లస్టర్లలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. బొబ్బిలి కళింగ వైద్యభవనంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆర్. వి. ఎస్. కె. కె. రంగారావు (బేబీ నాయన) హాజరై లైవ్ స్క్రీన్ ద్వారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్ ప్రసంగాలను వీక్షించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు.