మహానాడు రెండో రోజు కార్యక్రమాలు

6చూసినవారు
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు రెండో రోజు కార్యక్రమాలు గురువారం బొబ్బిలి నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే ఆర్. వీ. ఎస్. కె. కె. రంగారావు (బేబీ నాయన) దక్షిణ దేవిడి జంక్షన్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా వైశ్య భవనానికి చేరుకుని మహానాడు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :