రామభద్రపురం మండలం తారాపురం జాతీయ రహదారిపై ఆదివారం పశువులను తోలుకుంటూ వెళ్తున్న పిల్లా రమణను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయనను విజయనగరం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రమణ భార్య సాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.