పోలాకి మండలం డోల గ్రామానికి చెందిన ఎన్ని వీరన్న, ఈ నెల 8వ తేదీన ఎచ్చెర్ల వెళ్తానని చెప్పి బయటకు వెళ్లి అదృశ్యమయ్యారు. మొదట కుమార్తె ఇంటికి వెళ్లి ఉంటారని భావించిన భార్య వరలక్ష్మి, బుధవారం కుమార్తెతో మాట్లాడగా వీరన్న అక్కడికి రాలేదని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై జి రంజిత్ తెలిపారు. తెలిసినవారు 8336820309, 9963535577 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారికి ₹10,000 బహుమతి ప్రకటించారు.