బొబ్బిలిలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా భారీ అవగాహన వాక్ థాన్

2చూసినవారు
బొబ్బిలిలో మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఈరోజు ఉదయం భారీ 3 కి.మీ. వాక్ థాన్ నిర్వహించారు. డిఎస్పీ శ్రీమతి భవ్య రెడ్డి గారి ఆధ్వర్యంలో రాజా కాలేజీ గ్రౌండ్ నుండి ఈ ర్యాలీ ప్రారంభమైంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న సైకిల్ ర్యాలీ ముగింపు సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, వాకర్స్ మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించాలని డిఎస్పీ పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం అత్యంత విజయవంతమైంది.
Job Suitcase

Jobs near you