ఉపాధ్యాయుడి ఇంట్లో భారీ చోరీ

0చూసినవారు
ఉపాధ్యాయుడి ఇంట్లో భారీ చోరీ
బొబ్బిలి పట్టణంలోని వెలమవారివీధి సండే అపార్ట్‌మెంట్ మూడో అంతస్తులో నివసిస్తున్న ఉపాధ్యాయుడు బెవర రామకృష్ణ ఇంట్లో భారీ చోరీ జరిగింది. బీరువాలో ఉన్న సుమారు 12 తులాల బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. రామకృష్ణ కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే డీఎస్పీ భవ్యారెడ్డి, ఎస్సై రమేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్