రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐలో గురువారం మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ మేళాలో 11 బహుళజాతి సంస్థలు పాల్గొని, 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు కల్పించనున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ముందుగా వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ప్లేస్‌మెంట్ అధికారి భాస్కర్ ను 7989826953, 9618792572, 9988853335 నంబర్లలో సంప్రదించవచ్చు.