దాడితల్లి అమ్మవారిని దర్శించిన ఎమ్మెల్యే బేబీనాయన

0చూసినవారు
దాడితల్లి అమ్మవారిని దర్శించిన ఎమ్మెల్యే బేబీనాయన
గొల్లపల్లి గ్రామంతో పాటు 12 గ్రామాల ఇలవేల్పు అయిన శ్రీ శ్రీ శ్రీ దాడితల్లి అమ్మవారిని ఎమ్మెల్యే ఆర్. వీ. ఎస్. కె. కె. రంగారావు (బేబీనాయన) మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. అర్చకులు వేదోచ్చారణ నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదించారు. అనంతరం అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎమ్మెల్యే స్వయంగా ప్రసాదం పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్