బొబ్బిలి పట్టణంలోని రావువారి వీధిలో రాపాక రమణ ఇంట్లో షార్ట్‌సర్క్యూట్ వల్ల జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన కుటుంబాన్ని ఎమ్మెల్యే ఆర్. వి. ఎస్. కె. కె. రంగారావు (బేబీ నాయన) పరామర్శించి, తక్షణ ఆర్థిక సహాయం అందించారు.
టీడీపీ నాయకుడు బొత్స అప్పులు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. ఈ సంఘటనలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలిసింది.