రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు, నిన్న రాజాం టౌన్‌లోని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ క్యాంపు కార్యాలయంలో జరిగిన డిన్నర్ మీటింగ్‌లో బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు కిమిడి కళావెంకటరావు, అదితి గజపతిరాజు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజుతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. విజయనగరం, బొబ్బిలి ప్రాంతాలకు సంబంధించిన రాజకీయ అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.