ఘనంగా దేశతల్లి పండుగలు

1124చూసినవారు
గొల్లపల్లి దాడితల్లి గ్రామదేవత పండుగ సందర్భంగా, ఆదివారం బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో దేశతల్లి వారాలు వైభవంగా నిర్వహించారు. గొల్లపల్లి, కృష్ణాపురం, రంగరాయపురం, అప్పయ్యపేట, గున్నతోటవలసతో పాటు పలు గ్రామాల్లో భక్తులు అమ్మవారి ఘటాలను ఊరేగిస్తూ ప్రత్యేక పూజలు చేసి, నూతన వస్త్రాలు సమర్పించారు. కోళ్లు, గొర్రెపోతులను మొక్కగా సమర్పించి తమ కోరికలు తీర్చుకున్నారు. ఈ పండుగతో గ్రామాలు సందడిగా మారాయి.

సంబంధిత పోస్ట్