బొబ్బిలిలోని పారాది గ్రామ సచివాలయాన్ని ఎంపీడీవో పి. రవికుమార్ సోమవారం తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టిక, కార్యాలయ రికార్డులను పరిశీలించి, విధి నిర్వహణలో నిబద్ధతతో ఉండాలని, ప్రజలకు సేవలు అందించడంలో జాప్యం చేయరాదని ఆదేశించారు. రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.