
సంచార్ సాథీ యాప్‌పై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం
సైబర్ నేరాల కట్టడికి కేంద్ర ప్రభుత్వం 'సంచార్ సాథీ' యాప్‌ను తప్పనిసరి చేసింది. అయితే ఈ నిర్ణయంపై రాజ్యసభలో కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. డేటా ప్రైవసీకి భంగం కలుగుతుందని ఆరోపిస్తూ, కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నెలకొంది.




