బొబ్బిలి నియోజకవర్గంలో రాజకీయ పార్టీల సమావేశం

2చూసినవారు
బొబ్బిలి నియోజకవర్గంలో రాజకీయ పార్టీల సమావేశం
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, మంగళవారం బొబ్బిలిలో రాజకీయ పార్టీల సమావేశం జరిగింది. సహాయ ఎన్నికల నమోదు అధికారి, డిప్యూటీ తహసీల్దార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం, పోలింగ్ కేంద్రాల మార్పు, ఓటర్ లిస్ట్ పునర్విమర్శ, బి ఎల్ ఓ యాప్ ద్వారా మ్యాపింగ్, ప్రొగేనీ ఓటర్ల నమోదు వంటి కీలక అంశాలపై చర్చించారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు సన్నద్ధతపై దృష్టి సారించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్