ఆంధ్ర కొప్పులవెలమ సంక్షేమ సంఘం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తెంటు రమేష్ నాయుడు నియమితులయ్యారు. బొబ్బిలి మున్సిపాలిటీ మల్లంపేటకు చెందిన రమేష్ నాయుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ నియామకంపై సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, యువకుడు, విద్యావంతుడైన రమేష్ నాయుడు నాయకత్వంలో సంఘం కార్యక్రమాలు విస్తరించి సమాజానికి సేవలు అందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని రమేష్ నాయుడు తెలిపారు.