ఉపాధి పనుల వద్ద కొండచిలువ హల్‌చల్

1770చూసినవారు
ఉపాధి పనుల వద్ద కొండచిలువ హల్‌చల్
తెర్లాం మండలం పాములవలస గ్రామపంచాయతీ పరిధిలోని బొంతు వాణి చెరువులో సోమవారం ఉపాధి హామీ పనులు జరుగుతుండగా ఆరడుగుల కొండచిలువ ప్రత్యక్షమై కూలీలలో భయాందోళన సృష్టించింది. కొండచిలువ సంచారంతో భయపడిన కూలీలు పనులు నిలిపివేశారు. అనంతరం అప్రమత్తమైన కూలీలు కలిసి ఆ కొండచిలువను హతమార్చారు. ఈ సంఘటనతో గ్రామంలో కలకలం రేగింది.

సంబంధిత పోస్ట్