ప్రభుత్వ స్థలాలను కాపాడాలని ఆర్డీఓకు వినతి

3చూసినవారు
ప్రభుత్వ స్థలాలను కాపాడాలని ఆర్డీఓకు వినతి
బొబ్బిలి ఐటీఐ కాలనీలోని గొల్లపల్లి రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 42లో ఇండోర్ స్టేడియం రహదారిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని సీపీఎం నాయకులు ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. పి. శంకర్రావు, ఎస్. గోపాల్, బంగారి యుగంధర్ మాట్లాడుతూ, ఈ విషయాన్ని కమిషనర్, ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లినా చర్యలు లేవని తెలిపారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుని అక్రమ నిర్మాణాలు తొలగించాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్