సిరిమాను ఉత్సవాలకు భద్రత కట్టుదిట్టం… డ్రోన్ కెమెరాలతో నిఘా

876చూసినవారు
సిరిమాను ఉత్సవాలకు భద్రత కట్టుదిట్టం… డ్రోన్ కెమెరాలతో నిఘా
బొబ్బిలిలో దాడితల్లి, సరేపోలమ్మ సిరిమాను ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా భారీగా భక్తులు తరలివచ్చారు. సాయంత్రం 4 గంటలకు రెండు అమ్మవార్ల సిరిమాన్లు ఆలయాల నుంచి ఘనంగా ఊరేగింపుగా బయలుదేరనున్నాయి. భక్తులకు ఇబ్బందులు లేకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డీఎస్పీ, సీఐ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణ, భద్రత చర్యలు చేపట్టారు. ఎస్పీ ఏ. ఆర్. దామోదర్ ఆధ్వర్యంలో 300 మందికి పైగా పోలీసులు మోహరించి, డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్