బొబ్బిలి ప్రాంతంలో ఎండ తీవ్రత తర్వాత వాతావరణంలో మార్పు చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం ఆకాశం మబ్బులతో కమ్ముకొని తేలికపాటి జల్లులు కురిశాయి. ఈ చిరుజల్లులతో వాతావరణం చల్లబడుతూ ప్రజలకు ఉపశమనం కలిగింది. అయితే ఈ వర్షాలు కొంతమంది రైతులకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.