సిరిమాను ఉత్సవాల సందర్భంగా గొల్లపల్లి దాడితల్లి ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ఉత్తరాంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు భక్తులకు మంచినీరు, మజ్జిగ, పులిహోర వంటివి పంపిణీ చేస్తుండగా, ఆలయ కమిటీ ప్రసాదాలను అందిస్తోంది. ఈ ఉత్సవాలు భక్తుల తాకిడితో సందడిగా మారాయి.