గొల్లపల్లిలో దాడితల్లి అమ్మవారి పండగకు శ్రీకారం

0చూసినవారు
గొల్లపల్లిలో దాడితల్లి అమ్మవారి పండగకు శ్రీకారం
మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు గొల్లపల్లిలో 12 గ్రామాల విలవేల్పుగా భావించే దాడితల్లి అమ్మవారి పండగ ప్రారంభమైంది. గ్రామ తూర్పున ఉన్న ఆలయం వద్ద గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ అధ్యక్షుడు కురిమెల్ల మధుబాబు, సభ్యులు, ప్రజల సహకారంతో పీరిడి ఈశ్వరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బుధవారం నుంచి పండగ కొనసాగుతుంది. ముందుగా గోపాల్ ఇంట్లో పూజలు చేసి, అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి పూజలు నిర్వహిస్తారు. 6వ తేదీ వరకు ప్రత్యేక పూజలు జరిపి గఠాలను గ్రామంలో ప్రదక్షిణగా తీసుకెళ్లి తిరిగి ఆలయంలో ప్రతిష్ఠిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్