తండ్రిని హత్య చేసిన కుమారుడు వివరాలు ఇవే

6చూసినవారు
తండ్రిని హత్య చేసిన కుమారుడు వివరాలు ఇవే
బాడంగి మండలం గొల్లాది గ్రామంలో శనివారం ఒక దారుణం చోటుచేసుకుంది. పక్షవాతంతో మంచానికే పరిమితమైన తండ్రి మామిడి సత్యంను, మద్యం సేవించి వేధించే కొడుకు రాము కత్తితో గొంతు కోసి తల వేరు చేశాడు. తండ్రిని ఆపమని సైగ చేశాడని రాము ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. తలను సిమెంట్ గోలం‌లో వేసి బయట పడేశాడు. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్