శ్రీకాకుళం జిల్లా పౌర గ్రంథాలయంలో మణిపాత్రుని క్రియేటివ్ అకాడమి నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఉగాది ఉత్సవాల్లో భాగంగా, బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ బొంతలకోటి శంకర రావు భాగవతార్ కు ఉగాది సాహిత్య రత్న పురస్కారం ప్రదానం చేయనున్నారు. ఈ విషయాన్ని అకాడమి వ్యవస్తాపక అధ్యక్షులు మణిపాత్రుని నాగేశ్వరరావు ఆహ్వాన పత్రం ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా శంకర రావు మాట్లాడుతూ, ప్రాచీన కళలను, కళాకారులను గుర్తించి ప్రోత్సహిస్తున్న మణిపాత్రుని క్రియేటివ్ అకాడమి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పురస్కారం ఈ నెల 8వ తేదీ ఆదివారం ఉదయం ప్రదానం చేయబడుతుంది.