బొబ్బిలి పట్టణ ఎస్ఐ జ్ఞాన ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్, బీమా, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వారికి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ నియమాలను పాటించాలని, ప్రజల ప్రాణ భద్రత కోసం తనిఖీలు కఠినతరం చేస్తామని ఎస్ఐ జ్ఞాన ప్రసాద్ తెలిపారు.