డ్రగ్స్ నిర్మూలనకు బొబ్బిలిలో వాక్ థాన్

3చూసినవారు
డ్రగ్స్ నిర్మూలనకు బొబ్బిలిలో వాక్ థాన్
డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన అభ్యుదయం సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా శనివారం బొబ్బిలి టౌన్‌లో 3 కిలోమీటర్ల వాక్ థాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి బొబ్బిలి డిఎస్పి జి భవ్య రెడ్డి మాట్లాడుతూ, మత్తు పదార్థాలు, గంజాయి వల్ల జీవితాలు నాశనం అవుతాయని, యువత వీటికి దూరంగా ఉండి తమ భవిష్యత్తును బంగారు బాటలో నిర్మించుకోవాలని సూచించారు. డ్రగ్స్‌కు నో చెప్పి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వాక్ థాన్‌లో పోలీస్ సిబ్బంది, సామాజిక కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్