మహిళ ఆత్మహత్య యత్నం.. చికిత్స పొందుతూ మృతి

5చూసినవారు
మహిళ ఆత్మహత్య యత్నం.. చికిత్స పొందుతూ మృతి
రామభద్రపురం మండలంలోని కొట్టక్కి గ్రామానికి చెందిన రమణమ్మ (32) అనే యువతి, మద్యం మత్తులో వచ్చిన ఒక వ్యక్తి తనను భూత వైద్యురాలిగా దూషించడంతో అవమానంగా భావించి, బుధవారం ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భర్త బాలరాజు ఆమెను సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం విజయనగరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్