బస్సులో మహిళల ఘర్షణ: బాలికకు గాయాలు

12చూసినవారు
బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ బస్సులో మహిళల మధ్య జరిగిన వాగ్వాదం హింసకు దారితీసింది. దాడితల్లి అమ్మవారి పండుగకు వైజాగ్ నుంచి వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో ఈ ఘటన జరిగింది. కొందరు మహిళలు దాడి చేయడంతో వైజాగ్‌కు చెందిన 14 ఏళ్ల బెజ్జుపల్లి భార్గవి స్పృహ కోల్పోయింది. స్థానికుల సహాయంతో 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, తరువాత మెరుగైన చికిత్స కోసం విజయనగరం పంపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్