బొబ్బిలి పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న లారీ పల్సర్ బైక్‌ను ఢీకొనడంతో పక్కి గ్రామానికి చెందిన శంబంగి శంకర్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న బొబ్బిలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రుడిని బొబ్బిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అతన్ని మరో ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.