తెర్లాం మండలంలో అడ్డు రోడ్ సమీపంలోని సా మిల్లు వద్ద 4 మంది, ఒక జువెనైల్ గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఒడిశాలోని సుంకి నుంచి కొనుగోలు చేసి తెర్లాం తీసుకొచ్చినట్లు వెల్లడైంది. వారి వద్ద 2 కేజీలు 600 గ్రాముల గంజాయి, 4 మొబైల్ ఫోన్లు, ₹350 నగదు స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ సిబ్బంది సమక్షంలో సోదాలు నిర్వహించి కేసు నమోదు చేశారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా, పునరావృత నేరస్తుడిపై PIT NDPS కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.